గురువారం 28 మే 2020
International - Apr 29, 2020 , 09:34:10

వియ‌త్నాం యుద్ధం క‌న్నా ఎక్కువే మ‌ర‌ణించారు..

వియ‌త్నాం యుద్ధం క‌న్నా ఎక్కువే మ‌ర‌ణించారు..

హైద‌రాబాద్‌: అమెరికా చావుదెబ్బ తిన్న‌ది వియ‌త్నాం వార్‌లోనే.  ఆ యుద్ధంలో అమెరికా సైనికులు పిట్ట‌ల్లా రాలిపోయారు. సుమారు 58, 220 మంది అమెరికా సైనికులు వియ‌త్నాం యుద్ధంలో ప్రాణాలు విడిచారు. అయితే ఇప్పుడు కేవ‌లం రెండు నెల‌ల్లోనే.. అమెరికాలో వైర‌స్ వ‌ల్ల అంత క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌జ‌లు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.  వియ‌త్నాంలో రెండు ద‌శాబ్ధాల్లో చ‌నిపోయిన సైనికుల క‌న్నా.. రెండు నెలల్లో అమెరికాలో వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. మ‌రో వైపు వైట్‌హౌజ్ మెడిక‌ల్ అడ్వైజ‌ర్ డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసి మ‌రో వార్నింగ్ ఇచ్చారు. ఇప్ప‌ట్లో వైర‌స్ అంతం అయ్యే అవ‌కాశాలు లేవ‌న్నారు. ఒక‌వేళ క‌రోనాకు చికిత్స‌ను వీలైనంత త్వ‌ర‌గా క‌నుగొన‌లేక‌పోతే.. అప్పుడు ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంద‌న్నారు.

అమెరికా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ కేసులు ప‌ది ల‌క్షలు దాటాయి.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కేసుల్లో ఇది మూడ‌వ వంతు. ఇక వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 59 వేలు దాటింది.  ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా మాంసం కొర‌త ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై ట్రంప్ స్పందించారు.  మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల‌ను తెర‌వాల‌ను ఆదేశించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వాస్త‌వానికి మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్లు.. వైర‌స్ హాట్‌స్పాట్లుగా మారాయి. కానీ ఆహార కొర‌త‌ను తీర్చేందుకు వాటిని తెర‌వ‌క త‌ప్ప‌డం లేదు.

logo