శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 18, 2020 , 01:36:26

భూమిపైకి చంద్రుడి మట్టి

భూమిపైకి చంద్రుడి మట్టి

బీజింగ్‌, డిసెంబర్‌ 17: చైనా చేపట్టిన ‘చాంగే-5’ మిషన్‌ విజయవంతమైంది. నలభై ఏండ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి మట్టి నమూనాలు  భూమికి చేరాయి. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం వేకువజామున 1.59 గంటలకు ఉత్తర చైనాలోని సిజివాంగ్‌ బానర్‌ ప్రాంతంలో క్యాప్సూల్‌ భూమిపై దిగినట్టు చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌ తర్వాత చంద్రుడి  మట్టి నమూనాలను సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది.


logo