శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Jun 20, 2020 , 13:45:13

క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌కు కోతుల కొర‌త

క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌కు కోతుల కొర‌త

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్‌19 వ్యాక్సిన్ కోసం శ‌ర‌వేగంగా ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి.  చైనాలోనూ మ‌హ‌మ్మారికి టీకా కొనుగొనేందుకు జోరుగా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. అయితే చైనా ప‌రిశోధ‌న‌శాల‌ల‌కు ఇప్పుడు ఓ కొర‌త ఏర్ప‌డింది.  వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు చేప‌ట్టేందుకు కోతులు దొర‌క‌డం లేద‌ట‌. ఒక‌వేళ దొరికినా.. వాటి ఖ‌రీదు విప‌రీతంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  వ్యాక్సిన్‌ను మనుషుల మీద ప్ర‌యోగం చేయ‌డానికి పూర్వం.. కోతులపై ప‌రీక్ష చేయ‌నున్నారు.  

చైనాలో చాలా వ‌ర‌కు ఫార్మాకంపెనీలు ... కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తున్నాయి. ఎలుక‌లు, కుందేళ్ల‌పై ఇప్ప‌టికే కొన్ని ల్యాబ్‌ల్లో ప‌రీక్ష‌లు ముగిశాయి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్‌ను కోతుల‌పై ప‌రీక్షించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.  యిషెంగ్ అనేక ఫార్మా కంపెనీ భారీ స్థాయిలో వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు మొద‌లుపెట్టింది.  సెప్టెంబ‌ర్‌లోగా వ్యాక్సిన్ తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. రెస్ట్ లేకుండా ప‌రిశోధ‌కులు ప‌నిచేస్తున్న‌ట్లు ఫార్మా కంపెనీ ప‌రిశోధ‌కుడు జాంగ్ తెలిపారు. 

వ్యాక్సిన్ ఫ‌రీక్ష‌లు ప్ర‌స్తుతం యానిమ‌ల్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయ‌ని,  ఎలుక‌లు-కుందేళ్ల‌పై జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని ఫార్మా కంపెనీలు పేర్కొంటున్నాయి.   అయితే కోతుల‌పై ప్ర‌యోగం జ‌ర‌గాల్సి ఉంద‌ని, కానీ వాటి ఖ‌రీదు విప‌రీతంగా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా రీసెస్ జాతికి చెంది కోతులు ప‌దివేల యువాన్ల‌కు దొరికేవి. ఇప్పుడు వాటి ఖ‌రీదు ల‌క్ష యువాన్ల‌కు చేరిన‌ట్లు యెషింగ్ కంపెనీ పేర్కొన్న‌ది.