మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 14:49:03

పోయిన ఫోన్‌ దొరికింది.. గ్యాలరీ తెరిచి చూస్తే..!

పోయిన ఫోన్‌ దొరికింది.. గ్యాలరీ తెరిచి చూస్తే..!

బటుపహాట్‌: మలేషియాలోని బటు పహాట్‌కు చెందిన జాక్‌రిడ్జ్ రోడ్జి అనే 20 ఏళ్ల విద్యార్థి రాత్రి తన మంచం పక్కన ఫోన్‌ పెట్టి నిద్రపోయాడు. అయితే, మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి ఫోన్‌ లేదు. గది మొత్తం వెదికాడు. ఇంట్లో వాళ్లను అడిగాడు. ఎక్కడా ఫోన్‌ జాడలేదు. అతడి తండ్రి జాక్‌రిడ్జ్‌ ఫోన్‌కు రింగ్‌ ఇస్తూనే ఉన్నాడు. ఇంటి వెనుకాల రింగ్‌టోన్‌ వినిపించగా, రోడ్జి వెళ్లాడు. చివరికి ఓ తాటిచెట్టుకింద ఫోన్‌ దొరికింది. 

వెంటనే ఫోన్‌ను శుభ్రం చేసిన రోడ్జి గ్యాలరీ ఓపెన్‌ చేసి చూడగానే, షాక్‌ అయ్యాడు. అందులో కోతుల సెల్ఫీ ఫొటోలున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పినా మొదట ఎవరూ నమ్మలేదు. అందులోని ఒక ఫొటోలో ఓ కోతి ఫోన్‌ తినేందుకు ప్రయత్నించడం కూడా క్యాప్చర్‌ అయ్యింది. ఈ ఫొటోలన్నింటినీ రోడ్జి ఓ వీడియో రూపంలోకి మార్చి ట్విట్టర్‌లో పెట్టగా వైరల్‌ అయ్యింది. 2.5 లక్షల మందికి పైగా వీక్షించారు. కాగా, కోతి కిటికీ నుంచి వచ్చి ఫోన్‌ ఎత్తుకెళ్లి ఉంటుందని ఆ కుటుంబం భావిస్తోంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo