మంగళవారం 31 మార్చి 2020
International - Mar 20, 2020 , 01:46:20

అమెరికాలో నగదు బదిలీ

అమెరికాలో నగదు బదిలీ

వాషింగ్టన్‌: కరోనా ప్రభావంతో పరిశ్రమలు, సంస్థలు మూతపడి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ప్రజలందరికీ ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. పెద్ద వారికి వెయ్యి డాలర్లు(దాదాపు రూ.74వేలు), పిల్లలకు 500 డాలర్లు (దాదాపు రూ.37వేలు) అందించనున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్‌ మ్యూనిచ్‌ గురువారం పేర్కొన్నారు. ట్రంప్‌ కేటాయించిన 500 బిలియన్‌ డాలర్ల నుంచి వీటిని పంపిణీ చేస్తామని, ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత అమలు చేస్తామన్నారు. 

రోజువారీ వీసా సేవలు నిలిపివేత: ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వీసా సేవలను అమెరికా నిలిపివేసింది. చాలా దేశాల్లోని తమ రాయబార, కాన్సులేట్‌ కార్యాలయాల్లో నిత్యం జరిగే ఇమ్మిగ్రేషన్‌, నాన్‌ ఇమ్మిగ్రేషన్‌ వీసా అపాయింట్‌మెంట్లను ఈ నెల 18 నుంచి తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది.


logo
>>>>>>