శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 03, 2020 , 01:42:49

ఎన్‌ 95 మాస్కుల్లో వేడి ఆవిరితో వైరస్‌ మాయం!

ఎన్‌ 95 మాస్కుల్లో  వేడి ఆవిరితో వైరస్‌ మాయం!

టొరంటో: కరోనా బారిన పడకుండా ఇప్పుడు ప్రపంచమంతా మాస్కులను ధరిస్తున్నది. వైరస్‌ నుంచి ఎక్కువ రక్షణ లభిస్తుందని చాలా మంది ఎన్‌ 95 మాస్కులను వాడుతున్నారు. కానీ రెండు మూడు సార్లు వాడితే మాస్కు మీద కూడా వైరస్‌ ఉంటుందేమో అన్న భయంతో చాలా మంది వాటిని పడేస్తున్నారు. అయితే ఈ మాస్కులను వేడి నీటి ఆవిరితో శుభ్రం చేసి వాడవచ్చని, దాని ప్రత్యేకత ఏమీ దెబ్బతినదని కెనడా శాస్త్రవేత్తలు తెలిపారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ఓ గంటసేపు వేడి ఆవిరికి పెడితే కరోనా వైరస్‌ కూడా పోతుందన్నారు. దాదాపు 10 సార్లు ఇలా వాడుకోవచ్చని చెప్పారు. 


logo