బుధవారం 27 మే 2020
International - May 02, 2020 , 15:30:06

కరోనా పరిస్థితులపై థాయ్ ప్రధానితో మాట్లాడిన మోదీ

కరోనా పరిస్థితులపై థాయ్ ప్రధానితో మాట్లాడిన మోదీ

క‌రోనా మ‌హ‌మ్మారితో అనేక దేశాలు విల‌విల్లాడుతున్నాయి. పేద‌, ధ‌నిక దేశాలు అనే తేడాలేకుండా కొవిడ్-19తో తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నాయి. ఈ క్ర‌మంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేక దేశాలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆయా దేశాల అధినేత‌ల‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అక్క‌డి ప‌రిస్థితుల‌పై తెలుసుకుంటున్నారు. తాజాగా థాయ్ లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఇరుదేశాల్లో అమలవుతున్న కరోనా నివారణ చర్యలను పరస్పరం అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి క‌ష్ట‌కాలంలో ప్రాంతీయ సహకారం ఎంతో ప్రాధాన్యతాంశం అని మోదీ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. క‌రోనాకు సంబంధించిన అంశాలతో మిత్రుడు ప్రయుత్ చాన్ తో చర్చించాన‌ని చెప్పిన ఆయ‌న‌.. చారిత్రకంగా, సాంస్కృతికపరంగా సుదీర్ఘకాల సంబంధాలు కలిగిన ఇరుగుపొరుగు దేశాలుగా ప్రస్తుత సంక్షోభాన్ని ఉత్పన్నమవుతున్న అనేక సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామ‌ని తెలిపారు.logo