ఆదివారం 31 మే 2020
International - Apr 07, 2020 , 18:17:24

ఒమ‌న్ సుల్తాన్‌కు ప్ర‌ధాని మోదీ కృత‌జ్ఞ‌త‌లు

ఒమ‌న్ సుల్తాన్‌కు ప్ర‌ధాని మోదీ కృత‌జ్ఞ‌త‌లు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఒమ‌న్ సుల్తాన్ హైత‌మ్ బిన్ తారిఖ్ అల్ స‌యీద్‌తో మంగ‌ళ‌వారం ఫోన్‌లో సంభాషించారు. ఒమ‌న్‌లో భార‌తీయుల యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ క‌రోనా ప‌రిస్థితి గురించి ఆరా తీశారు. ఒమ‌న్‌లోని భార‌త పౌరుల సంక్షేమంపై వ్య‌క్తిగ‌త శ్ర‌ద్థ క‌న‌బ‌రుస్తున్నందుకు ఒమ‌న్ సుల్తాన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ విష‌యాల‌న్నింటిని ప్ర‌ధాని మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించారు. కాగా, క‌రోనా కార‌ణంగా భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 4,421 కేసులు న‌మోదు కాగా, 114 మంది మ‌ర‌ణించారు. అయితే ఒమ‌న్‌లో 371 కేసులు న‌మోదు కాగా, ఇద్ద‌రు మృతిచెందారు.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo