మోడెర్నా టీకాతో మూడు నెలల రక్షణ!

హైదరాబాద్ : మోడెర్నా వ్యాక్సిన్ మూడు నెలల వరకు కరోనా వైరస్ నుంచి రోగ నిరోధక శక్తి అందిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. అమెరికా ఫార్మా దిగ్గజం మోడెర్నా ఇంక్ ఇటీవల తన కొవిడ్ వ్యాక్సిన్ 94.1శాతం సామర్థ్యం కలిగి ఉందని ప్రకటించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అలెర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ (ఎన్ఐఐఐడీ) అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ నుంచి మోడెర్నా వ్యాక్సిన్ మానవుల్లో రోగ నిరోధక వ్యవస్థకు కనీసం మూడు నెలల వరకు శక్తివంతమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుందని తేలింది. డ్రగ్‌ను అభివృద్ధి చేసిన ఎన్ఐఏఐడీ సహ పరిశోధకుల మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌లో 34 మంది పాల్గొన్నారు. ఇందులో యువకులు, వయోజనులు రోగ నిరోధక ప్రతిరక్షకాలను వృద్ధి చేసినట్లు కనుగొన్నారు. ఎంఆర్ఎన్-1273 (MRNA-1273) పేరుతో పిలిచే వ్యాక్సిన్ వలంటీర్‌కు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వబడుతుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మొదటి మోతాదు తర్వాత 119 రోజుల తర్వాత, రెండో టీకా వేసిన 90 రోజుల తర్వాత ఇమ్యునోజెనిసిటీ డేటా (mRNA-1273) ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసింది.
అనంతరం వలంటీర్లలో ప్రతి రోధకాల సంఖ్య కాలకమ్రేణ తగ్గిపోయాయని గుర్తించారు. అయితే ఇది ఆందోళన కలిగించే విషయం కాదని టెక్సాస్ ఏఎం యూనివర్సిటీ టెక్సార్కానా వైరాలజిస్ట్ బెంజమిన్ న్యూమాన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ప్రతిరోధకాల పరిమాణం వృధుల్లో కంటే తక్కువ వయస్సున వారిలో ఎక్కువగా ఉంది. కానీ, 70 సంవత్సరాల వయస్సున్న రోగుల్లోనూ బలమైన రోగ నిరోధక ప్రతి స్పందనలు కనిపించాయని, వ్యాక్సిన్ ఒక రకమైన రోగ నిరోధక కణాన్ని యాక్టివేట్ చేసింది. ఇది మెమరీ స్పందన అని పిలవబడేలా సహాయపడుతుందని, అయితే దీర్ఘకాలిక అధ్యయనం మాత్రమే ఇది నిజంగానే అవుతుందో లేదో నిర్ధారిస్తుందని నివేదిక తెలిపింది. ఎన్ఐఏఐడీ డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ, ఇతర నిపుణులు మాట్లాడుతూ రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌ను తిరిగి బహిర్గతం చేస్తేనే.. తర్వాత కొత్త ప్రతి రోధకాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఇదిలా ఉండగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సలహా కమిటీ వ్యాక్సిన్‌ను డిసెంబర్ 17న సమీక్షించనుంది.
తాజావార్తలు
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
- ‘రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి’
- ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- గోదారమ్మ పరుగులు..!
- టీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
- కోహ్లీ, హార్దిక్ పునరాగమనం
- అంగన్వాడీలకు డ్రెస్‌కోడ్..
- అందరూ హీరోలే..
- ఆర్టీసీకి సం‘క్రాంతి’