శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 22, 2020 , 18:53:04

కొవిడ్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 40% కంటే ఎక్కువ మంది పేర్ల నమోదు: మోడెర్నా

కొవిడ్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 40% కంటే ఎక్కువ మంది పేర్ల నమోదు: మోడెర్నా

వాషింగ్టన్‌: తమ టీకా చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 40% కంటే ఎక్కువ మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు అమెరికా ఔషధ అభివృద్ధి సంస్థ మోడెర్నా ఇంక్‌ పేర్కొంది. చివరిదశలో 30,000 మందిపై టీకాను పరీక్షించాల్సి ఉండగా, ఇప్పటివరకూ  13,000  మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం పేర్లు నమోదు చేసుకున్నవారిలో 18% మంది నల్లజాతీయులు, లాటిన్‌అమెరికన్‌, అమెరికన్ ఇండియన్, అలాస్కా నేటివ్ వారు ఉన్నారని వివరించారు.  

మోడెర్నా జూలైలో దాని టీకా ఎంఆర్‌ఎన్‌ఏ-1273పై ట్రయల్స్‌ ప్రారంభించింది. సెప్టెంబర్‌లోపు క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  గత వారం, కంపెనీ యూఎస్ ప్రభుత్వంతో 100 మిలియన్ మోతాదుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సుమారు 1.5 బిలియన్లకు అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo