శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 03:29:30

మోడెర్నా వ్యాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకం

మోడెర్నా వ్యాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకం

వాషింగ్టన్‌: కరోనా నియంత్రణకు అమెరికా బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా ఆధ్వర్యంలో కోతులపై నిర్వహించిన తొలిదశ ట్రయల్స్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వాటిలో రోగ నిరోధక శక్తిని వ్యాక్సిన్‌ బలోపేతం చేసిందని, వైరస్‌ను శరవేగంగా నియంత్రించిందని ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షిసియస్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐఏఐడీ), మొడెర్నా సంస్థ సంయుక్తంగా ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి.


logo