International
- Nov 30, 2020 , 18:43:43
మా వ్యాక్సిన్ 100 శాతం సమర్థవంతం: మోడెర్నా

వాషింగ్టన్: తమ కరోనా వైరస్ వ్యాక్సిన్ 100 శాతం సమర్థవంతంగా పని చేస్తోందని ప్రకటించింది అమెరికా కంపెనీ మోడెర్నా. ప్రయోగాల పూర్తి ఫలితాలు ఈ వ్యాక్సిన్ 94.1 శాతం సమర్థవంతంగా ఉన్నట్లు చూపించాయని, అయితే తీవ్రమైన కేసుల విషయంలో ఇది 100 శాతం పని చేసినట్లు ఆ మోడెర్నా వెల్లడించింది. అమెరికా, యూరప్‌లలో తమ వ్యాక్సిన్ వాడకానికి క్లియరెన్స్ కోరతామని తెలిపింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)ను కోరనున్నట్లు మోడెర్నా ఒక ప్రకటనలో చెప్పింది. అంతేకాకుండా మార్కెటింగ్ కోసం యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ)కు దరఖాస్తు చేసుకుంటామని కూడా తెలిపింది.
తాజావార్తలు
- 11 మంది బాల్య స్నేహితురాళ్ల మృతి
- కరోనా వారియర్స్‌కు నేడు వ్యాక్సినేషన్
- ఇంటింటా రంగవల్లులు.. ఊరూరా ఆటల పోటీలు
- రెండోసారి ట్రంప్ అభిశంసన
- సీఎం కేసీఆర్ జోలికి వస్తే ఖబడ్దార్
- 25లోగా పనులు పూర్తి చేయాలి
- సామియా @ 2
- కేసీఆర్, మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం
- టీఎస్ఆర్టీసీకి జాతీయ పురస్కారం
- యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
MOST READ
TRENDING