మంగళవారం 26 మే 2020
International - Apr 09, 2020 , 16:35:38

డాక్ట‌ర్ గా సేవ‌లందించ‌నున్న మోడ‌ల్ క్వీన్

డాక్ట‌ర్ గా సేవ‌లందించ‌నున్న మోడ‌ల్ క్వీన్

ఫొటోలో క‌నిపిస్తోన్న ఈ అందాల సుంద‌రి పేరు భాషా ముఖ‌ర్జీ. మెడిసిన్ లో రెండు బ్యాచిల‌ర్ డిగ్రీ ప‌ట్టాలు తీసుకుంది. మోడ‌లింగ్ మీదున్న ఇష్టంతో భాషా ముఖ‌ర్జీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించింది. ఎంతో క‌ష్ట‌ప‌డి 2019 లో మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని ద‌క్కించుకుంది. హ్యుమానిటేరియ‌న్ ట్రిప్ లో భాగంగా తొలుత మార్చి లో ఇండియాకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత త‌న సొంత దేశం యూకే కు వెళ్లింది.

జూనియ‌ర్ డాక్ట‌ర్ గా మ‌ళ్లీ మెడిక‌ల్ కెరీర్ ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో భాషా ముఖ‌ర్జీ 14 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ఉండనుంది. భాషా ముఖ‌ర్జీ సెల్ఫ్ ఐసోలేష‌న్ పీరియ‌డ్ పూర్త‌యిన వెంట‌నే బోస్ట‌న్ లోని పిలిగ్రిమ్ హాస్పిట‌ల్ లో డాక్ట‌ర్ గా సేవ‌లందించ‌నుంది . 





ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo