ఆదివారం 24 జనవరి 2021
International - Dec 05, 2020 , 15:13:09

మోడల్‌ ఫొటో షూట్ కాంట్రావర్సీ...!

 మోడల్‌ ఫొటో షూట్ కాంట్రావర్సీ...!

ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద  ఓ మోడల్ నిర్వహించిన ఫొటో‌షూట్ వివాదాస్పదమైంది.  ఈజిప్ట్ ప్రభుత్వం ఆ మోడల్ వేసుకున్న దుస్తులను తప్పుబట్టింది.నిజానికి ఆమె వేసుకున్నది ఈజీప్ట్ సంప్రదాయ దుస్తులే. పైగా, ఆమె ఎలాంటి ఎక్స్ పోజింగ్ కూడా చేయలేదు. అయితే, ఆమె శరీరాకృతి వల్ల అలా కనిపించినా.. ప్రభుత్వం దాన్ని ఆ దృష్టితో చూడటం తప్పని అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ప్రభుత్వం దీన్ని ఎందుకంత సీరియస్‌గా తీసుకుందంటే.. ?

ఈజిప్షియన్ మోడల్‌ సల్మా అల్-షిమికి కైరో‌లో గల పిరమిడ్ ఆఫ్ జొజర్ వద్ద అలనాటి ప్రాచీన సంప్రదాయ దుస్తులతో ఫొటోలు, వీడియోలు తీయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు షిమితోపాటు ఫొటోగ్రాఫర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సక్కారా నెక్రోపోలిస్ వద్ద గల ఆర్కియలాజికల్ జోన్‌లో అనుమతి లేకుండా ఫొటోషూట్ చేశారని, యాంటిక్విటీస్ మినిస్ట్రీ నిబంధనలకు ఇది విరుద్ధమని పోలీసులు తొలుత వెల్లడించారు. అయితే, ఈ ఫొటోలపై ప్రభుత్వం చెబుతున్న కారణాలేమీ స్పష్టంగా లేకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే వేలాది మంది ఫాలోవర్లు కలిగిని సిమి.. ఆ దుస్తులతో ఈజిప్ట్ ప్రాచీన వారసత్వ సంపదను అవమానించిందంటూ కొందరు నెటిజనులు విమర్శించారు. అయితే, కొందరు మాత్రం.. అందులో తప్పు ఏముందంటూ మోడల్ ను సపోర్ట్ చేశారు. ప్రపంచ వింతల్లో ఒకటైన పిరమిడ్ల వద్ద ఫొటోలు తీసుకోవడం కూడా తప్పేనా? అని పలువరు ప్రశ్నిస్తున్నారు. పైగా, ఆమె వేసుకున్న దుస్తుల్లో అశ్లీలత ఏముందో చెప్పాలని ముక్తకంఠంతో మొత్తుకుంటున్నారు. దీనిపై మోడల్ షిమీ ఇంకా స్పందించలేదు. అయితే, 2018లో ఓ జంట ఏకంగా పిరమిడ్ల పైకి చేరుకుని దుస్తులు లేకుండా ఫొటోషూట్‌లో పాల్గొ్న్నారు. ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆఘటనతో పోలిస్తే.. షిమీ ఫొటోషూట్‌ విషయంలో పెద్ద సమస్యేమీ లేదని   ఆమె అభిమానులు అంటున్నారు. 


https://www.instagram.com/salma.elshimy.officiall/

 


logo