బైక్‌పై మొబైల్ లైబ్రరీ

- శ్రీలంకలో ఓ యువకుడి ఔదార్యం
కొలంబో, నవంబర్ 27: ఎక్కడో దూరంగా విసిరేసినట్టుండే గ్రామాలు.. ప్రాథమిక సదుపాయాలే కరువు.. ఇక లైబ్రరీ ఎక్కడిది? శ్రీలంకలోని అలాంటి మారుమూల గ్రామాల పిల్లలకు పుస్తక పరిజ్ఞానం దూరం కాకూడదనే సదాశయంతో ఓ యువకుడు సొంతంగా తానే మొబైల్ లైబ్రరీని నడుపుతున్నాడు. రూ.30,000తో కొన్న సెకండ్ హ్యాండ్ బైక్ వెనుకభాగాన ఒక పెద్ద బాక్స్ బిగించి.. దాంట్లో పుస్తకాలు పెట్టుకుని ఊరూరా తిరిగి పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాడు. ఆ యువకుడి పేరు మహింద దశనాయక. ప్రభుత్వ శాఖలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జీతం నెలకు రూ.20 వేలు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన జీతంలో పావు వంతు మొబై లైబ్రరీకే వెచ్చిస్తున్నారు. ‘బట్టీ చదువులతో సతమతమవుతున్న పిల్లలకు ఏదైనా చేయాలనిపించింది. సమాజాన్ని వారు చూసే దృక్కోణంలో మార్పు తేవాలనుకున్నా. అందుకే మూడేండ్ల కిందట బుక్ అండ్ మి అనే ప్రోగ్రామ్ ప్రారంభించా’ అని ఆయన తెలిపారు. 150 పుస్తకాలతో మొదలైన ఈ కార్యక్రమం.. నేడు 3వేల పుస్తకాలకు చేరింది.
తాజావార్తలు
- 31లోగా పదోన్నతులు పూర్తిచేయాలి : సీఎస్
- భారత్‌కు బయలుదేరిన మరో మూడు రాఫెల్స్
- రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
- 'ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది'
- ధారావిలో కరోనా కేసులు నిల్
- ఏపీ సమాచార కమిషనర్‌కు ఎస్ఈసీ మెమో
- రిపబ్లిక్ డే హింస.. దేశానికే అవమానం : అమరిందర్ సింగ్
- తెలుగు సినీ ప్రముఖులకు వృక్షవేదం పుస్తకం అందజేత
- ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
- ‘తల్లిదండ్రుల సమ్మతి ఉంటనే పాఠశాలకు అనుమతి’