మాస్కో: వ్యాక్సిన్ మిక్సింగ్ ( Vaccine Mixing ) పై పలు దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రాజెనికా ( Astrazeneca ), స్పుత్నిక్ వీ ( Sputnik V ) టీకాలతో వ్యాక్సిన్ మిక్సింగ్ ట్రయల్స్ నిర్వహించారు. దానికి సంబంధించిన ఫలితాలను రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) రిలీజ్ చేసింది. ఆస్ట్రాజెనికా కంపెనీ టీకాతో పాటు స్పుత్నిక్ లైట్ టీకాను ఇస్తే, దాని నుంచి ఎటువంటి దుష్ ప్రభావాలు లేవని రష్యా ఏజెన్సీ పేర్కొన్నది. అజర్బైజాన్లో స్వల్ప స్థాయిలో వ్యాక్సిన్ మిక్సింగ్ పరీక్షలు చేపట్టినట్లు ఆర్డీఐఎఫ్ తెలిపింది. ఆస్ట్రాజెనికా కంపెనీ ఇండియాలో సీరం కంపెనీతో కలిసి కోవీషీల్డ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. తొలి డోసు స్పుత్నిక్ టీకాతో ఆస్ట్రాజెనికా టీకాను మిక్స్ చేస్తే, దాని నుంటి వాలెంటీర్లలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేల్చారు. మొత్తం 50 మంది వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించారు. ఫిబ్రవరిలో ఈ ట్రయల్స్ జరిగినట్లు తెలుస్తోంది.