శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Jan 18, 2020 , 04:02:45

అమెరికాలో భారత సంతతి మహిళ హత్య!

 అమెరికాలో భారత సంతతి మహిళ హత్య!

వాషింగ్టన్‌: అమెరికాలో గత నెల 30న అదృశ్యమైన భారత సంతతికి చెందిన మహిళ సురీల్‌ దాబావాలా (34) మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. ఆమె డిసెంబర్‌ 30న ఇంటి నుంచి బయటికివెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. సురీల్‌ ఆచూకీ తెలిపిన వారికి 10,000 డాలర్లు (దాదాపు రూ.7 లక్షలు) బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. పోలీసులు గాలింపు చేపట్టి చివరికి సోమవారం షికాగోలోని పశ్చిమ గార్‌ఫీల్డ్‌ పార్క్‌ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి ఆమె సొంతకారు డిక్కీలోనే పడేసి ఉండటం అనుమానాలను రేకెతిస్తున్నది. గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నా రు. సురీల్‌ తండ్రి అశ్రఫ్‌ సొంత రాష్ట్రం గుజరాత్‌. డాక్టర్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. 


logo