గురువారం 28 మే 2020
International - May 07, 2020 , 16:11:55

అణుక్షిపణుల కోసం భారీ స్టోరేజి నిర్మాణం

అణుక్షిపణుల కోసం భారీ స్టోరేజి నిర్మాణం

ప్ర‌పంచ మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఉత్త‌ర‌కొరియా మాత్రం త‌న‌ప‌ని తానుచేసుకుపోతుంది. క‌రోనా నియంత్ర‌ణ‌కు దేశాల‌న్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కాని ఉత్త‌ర‌కొరియా  మళ్లీ అణ్వస్త్రాల పెంపుపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియాపై నిఘా వేసిన ఉపగ్రహాలు అత్యంత ఆసక్తికరమైన ఫుటేజి సేకరించాయి. రాజధాని ప్యాంగ్ యాంగ్ సమీపంలోని సిల్-లి ప్రాంతంలో కొన్ని భారీ కట్టడాలు నిర్మాణం జరుపుకుంటున్నట్టు నిపుణులు గుర్తించారు. అక్క‌డ అణుక్షిపణుల కర్మాగారంతో అనుసంధానిస్తూ ఓ రైల్వే లైను, మూడు భారీ హ్యాంగర్లు, ఓ భారీ భూగర్భ స్టోరేజి వసతి శాటిలైట్ చిత్రాల్లో కనిపించాయి. ఇవి అన్ని కూడా అణుక్షిప‌ణులు స్టోర్ చేయ‌డానికి ఇవి నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం. దీనికి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య ప‌నులు జ‌రుగుతున్నాయి.logo