గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 09:33:14

స్టెత‌స్కోప్ ప‌ట్టిన మిస్ ఇంగ్లాండ్..వీడియో

స్టెత‌స్కోప్ ప‌ట్టిన మిస్ ఇంగ్లాండ్..వీడియో

మిస్ ఇంగ్లాండ్-2019 భాషా ముఖర్జీ స్టెత‌స్కోప్ ప‌ట్టింది.  భాషా ముఖ‌ర్జీ బోస్ట‌న్ లోని పిలిగ్రిమ్ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ గా విధుల్లో చేరింది. మెడ‌లో స్టెత‌స్కోప్ పెట్టుకుని ఆస్ప‌త్రి సిబ్బందితో క‌లిసి వ‌స్తోన్న వీడియోను భాషా ముఖ‌ర్జీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. 

భాషా ముఖ‌ర్జీ మెడిసిన్ లో రెండు బ్యాచిల‌ర్ డిగ్రీ ప‌ట్టాలు తీసుకుంది. మోడ‌లింగ్ మీదున్న ఇష్టంతో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించింది. ఎంతో క‌ష్ట‌ప‌డి 2019 లో మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని ద‌క్కించుకుంది. హ్యుమానిటేరియ‌న్ ట్రిప్ లో భాగంగా తొలుత మార్చి లో ఇండియాకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత త‌న సొంత దేశం యూకే కు వెళ్లింది. జూనియ‌ర్ డాక్ట‌ర్ గా మ‌ళ్లీ మెడిక‌ల్ కెరీర్ ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో భాషా ముఖ‌ర్జీ 14 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ఉంది. సెల్ఫ్ ఐసోలేష‌న్ పీరియ‌డ్ పూర్త‌యిన నేప‌థ్యంలో తాజాగా విధుల్లో చేరింది.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo