ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 16:37:51

న‌చ్చిన వారిని కౌగిలించుకోలేక‌పోతున్నారా? అయితే ఇలా చేయండి!

న‌చ్చిన వారిని కౌగిలించుకోలేక‌పోతున్నారా? అయితే ఇలా చేయండి!

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఒక‌రిని తాకాల‌న్నా భ‌య‌మే. ఏదైనా బాధ క‌లిగిన‌ప్పుడు మ‌న‌సారా అమ్మ‌ను హ‌త్తుకోవాల‌న్నా ఆలోచిస్తున్న‌ త‌రుణంలో ఇజ్రాయెల్ నేచ‌ర్ అండ్ పార్క్స్ అథారిటీ కొత్త ప‌ద్ధ‌తిని తీసుకువ‌చ్చారు. స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకోలేక బాధ‌ప‌డుతున్న వారు ఇప్ప‌టి నుంచి బదులుగా చెట్టును కౌగిలించుకోమ‌ని చెబుతున్నారు.

టెల్ అవీవ్‌కు ఉత్తరాన 15 కిలోమీటర్ల‌ ఉద్యానవ‌నాన్ని అథారిటీ ఏర్పాటు చేసింది. ఇక్క‌డ కౌగిలించుకొని ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డానికి సిఫార్స్ చేస్తున్నామ‌ని అపోలోనియా నేష‌న‌ల్ పార్క్‌లో అథారిటీ మార్కెటింగ్ డైరెక్టర్ ఒరిట్ స్టెయిన్‌ఫెల్డ్ చెప్పారు. అయితే ఆరుబ‌య‌ట ఫేస్‌మాస్కులు త‌ప్ప‌నిస‌రి అని ఇజ్రాయెల్‌కు సూచించారు. మ‌రింకెందుకు ఆల‌స్యం బాధ‌ను లోప‌లే అనిచివేసుకుంటున్న వారు చెట్ల‌ను హ‌గ్ చేసుకొని బారాన్నంతా దించేసుకోండి.logo