బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 18:11:20

ఆయన్ను ప్రధాని చేసింది నేనే.. ఇప్పుడు ఆయనకు ఆట చూపిస్తా..

ఆయన్ను ప్రధాని చేసింది నేనే.. ఇప్పుడు ఆయనకు ఆట చూపిస్తా..

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు, దేశంతోపాటు క్రికెట్ సమస్యలకు పూర్తి కారణం ఆయనే అని, అయనను ప్రధాని పీఠం నుంచి దింపితేగానీ పాకిస్తాన్ బాగుపడదని అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ కు గుణపాఠం నేర్పుతానంటున్నారు జావెద్ మియందాద్.

నా సహాయంతోనే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ దేశ ప్రధాని అయ్యాడని జావెద్ మియందాద్ చెప్పారు. కానీ అతను దేశానికి ద్రోహం చేశాడని, త్వరలో రాజకీయాల్లోకి వచ్చిన వారికి రాజకీయాలు నేర్పుతానని అన్నారు. మియాందాద్ మంగళవారం తన యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు.

తన కారణంగానే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని కాగలిగారని, తన మాటలు ఏమైనా అబద్ధమైతే ఖండించాలని మియాండాద్ పేర్కొన్నారు. ఇమ్రాన్ తప్పుడు కార్యక్రమాల కారణంగా దేశంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని, క్రికెట్ సమస్యలకు కూడా అతడే ప్రధాన కారకుడని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో తప్పుడు వ్యక్తులను ఇమ్రాన్ నియమించారని ఆరోపించాడు. ఇమ్రాన్ తనను తాను దేవుడిగా భావించడం ప్రారంభించారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నానిని చెప్పాడు. దేశంలో క్రికెట్ బోర్డును నడపడానికి తగినంత మంది లేరని భావిస్తున్న ఆయన.. క్రికెట్ గురించి ఏమీ తెలియని విదేశీయులను బోర్డులో నియమించారని దుమ్మెత్తిపోశారు.

1992 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన మియాండాద్.. దేశీయ క్రికెటర్లను నిరుద్యోగులుగా మార్చాడని ఇమ్రాన్ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రధాని ఉద్దేశపూర్వకంగా డిపార్ట్‌మెంట్ క్రికెట్‌ను ఆపారని, దీంతో ఆటగాళ్లు నిరుద్యోగులుగా మారారని ఆయన చెప్పారు. త్వరలో రాజకీయాల్లోకి వచ్చి అటు ఇమ్రాన్ ఖాన్ కు గుణపాఠం చెప్పడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను పీసీబీని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు.logo