సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 05, 2020 , 01:47:49

మీరా నాయర్‌ కుమారుడి విజయం

మీరా నాయర్‌ కుమారుడి విజయం

న్యూయార్క్‌: బాలీవుడ్‌కు చెందిన సినీ నిర్మాత మీరా నాయర్‌ కుమారుడు జొహ్రాన్‌ క్వామీ మమ్దానీ న్యూయార్క్‌ నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. న్యూయార్క్‌లోని 36వ జిల్లా నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. మమ్దానీ వయస్సు 29 ఏండ్లు. సామ్యవాద న్యూయార్క్‌ను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన ట్వీట్‌ చేశారు. ‘డెమోక్రాటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా’ అనే సంస్థ (ఎన్జీవో) నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి మమ్దానీనే కావడం విశేషం.