బుధవారం 08 జూలై 2020
International - Jun 27, 2020 , 16:13:14

ఐ లవ్‌ న్యూయార్క్‌ సృషికర్త గ్లేజర్‌ కన్నుమూత

ఐ లవ్‌ న్యూయార్క్‌ సృషికర్త గ్లేజర్‌ కన్నుమూత

న్యూయార్క్‌ : ఐ లవ్‌ న్యూయార్క్‌ లోగోను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మిల్టన్‌ గ్లేజర్‌ కన్నుమూశారు. ఆయన వయసు 91 వ సంవత్సరాలు. గ్రాఫిక్ డిజైనర్ మిల్టన్ గ్లేజర్ ఎంతో ప్రసిద్ధి పొందారు. గుండెపోటుతోపాటు మూత్రపిండం వైఫల్యంతో గ్లేజర్‌ బాధపడుతున్నట్టు ఆయన భార్య షిర్లీ గ్లేజర్‌ తెలిపారు.

పోస్టర్లు, లోగోలు, ప్రకటనలు, పుస్తకాల కవర్లన్నీ గ్లేజర్ ఆలోచనల నుంచి తయారైన ఐ లవ్‌ న్యూయార్క్‌ అనే లోగోతో నిండిపోయి కనిపించేవి. ఇప్పటికీ ఈ లోగోకు ఎంతు ప్రచుర్యం ఉన్నది. న్యూయార్క్‌ వెళ్లిన వారెవరైనా.. ఐ లవ్‌ న్యూయార్క్‌ లోగో ముందు నిలబడి ఫొటోలు దిగాల్సిందే. ఈ లోగో రూపకల్పన తర్వాత ఎన్నో దేశాలు తమ ఉత్పత్తుల ప్రాచుర్యం కోసం ఇలాంటి లోగోల రూపకల్పన చేసుకొన్నాయి.  1960 చివరలో క్లే ఫెల్కర్‌తో కలిసి న్యూయార్క్ పత్రికను స్థాపించిన జట్టులో అతను డిజైనర్గా ఉన్నారు.

మిల్టన్‌ గ్లేజర్ 1929 లో బ్రోంక్స్లో లో జన్మించాడు. న్యూయార్క్ కూపర్ యూనియన్ ఆర్ట్ స్కూల్తోపాటు ఇటలీలో కూడా విద్యాభ్యాసం కొనసాగించాడు. 1954 లో సేమౌర్ ష్వాస్ట్, ఇతరులతో కలిసి వినూత్న గ్రాఫిక్ డిజైన్ సంస్థ పుష్ పిన్ స్టూడియోస్‌ను స్థాపించారు. తన సొంత సంస్థను స్థాపించడానికి ముందు 20 ఏండ్లపాటు ఇక్కడే డిజైనర్‌గా సేవలందించారు. కూపర్-హెవిట్, స్మిత్సోనియన్ డిజైన్ మ్యూజియం 2004 లో అతడికి జీవితకాల సాధన అవార్డును ప్రదానం చేసింది. 2009 లో నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా బహూకరించి సత్కరించారు.


logo