సోమవారం 01 జూన్ 2020
International - May 01, 2020 , 10:31:14

స‌ముద్రంలో కూలిపోయిన మిలిట‌రీ హెలికాప్ట‌ర్‌

స‌ముద్రంలో కూలిపోయిన మిలిట‌రీ హెలికాప్ట‌ర్‌

టొరంటో :  కెన‌డాలో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన మిలిట‌రీ హెలికాప్ట‌ర్ స‌ముద్రంలో కూలిపోయింది. గ్రీస్, ఇటలీ దేశాల అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో పహరా కాస్తున్న నాటో నేవల్ టాస్క్‌ఫోర్స్ రాయల్ కెనడా నేవీ హెలికాప్టరు గ్రీస్ లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడీ తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ఐదుగురు  గ‌ల్లంతు ఆయ్యార‌ని తెలిపారు. గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయ‌ని, వారంతా క్షేమంగా భ‌య‌ట‌ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఆశాభావం వ్య‌క్తం చేశారు.


logo