గురువారం 16 జూలై 2020
International - Jun 14, 2020 , 11:15:12

60 మంది హతం.. 20 మంది సైనికులే

60 మంది హతం.. 20 మంది సైనికులే

హైదరాబాద్‌ : నైజీరియాలోని బోర్నో స్టేట్‌లో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. సైనికులతో పాటు పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఈ కాల్పుల్లో 20 మంది సైనికులు చనిపోగా, మరో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 

మోంగునో ఏరియాలోకి శనివారం ఉదయం 11 గంటలకు ఉగ్రవాదులు ప్రవేశించారు. రాకెట్‌ లాంఛర్లు, ఆయుధాలతో కాల్పులు జరపడంతో 20 మంది సైనికులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో మూడు గంటల పాటు ఉగ్రవాదులు విచ్చలవిడిగా తిరిగారు. ఉగ్రవాదులు, ఆర్మీ మధ్య జరిగిన కాల్పుల్లో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్న ఓ పోలీస్‌ స్టేషన్‌కు, యూనైటెడ్‌ నేషన్స్‌ హ్యుమనిటేరియన్‌ హబ్‌కు నిప్పు పెట్టారు. 

అక్కడితో ఆగిపోకుండా.. గంజై ప్రాంతంలోకి కూడా ఉగ్రవాదులు వెళ్లారు. మోటారు సైకిళ్లపై వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పాయారు. కొద్ది రోజుల క్రితం గుబియాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు 69 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు.


logo