గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 03, 2020 , 08:19:03

ట్రంప్‌తో చ‌ర్చ‌ల త‌ర్వాతే టిక్‌టాక్ కొనుగోలు

ట్రంప్‌తో చ‌ర్చ‌ల త‌ర్వాతే టిక్‌టాక్ కొనుగోలు

వాషింగ్ట‌న్‌: ‌వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సాఫ్ట్వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. టిక్‌టాక్ కోనుగోలుకు సంబంధించి చ‌ర్చ‌లు కొన‌సాగించిడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉంద‌ని, అయితే ఈ విష‌యంపై అధ్య‌క్షుడు ట్రంప్‌తో సంస్థ సీఈఓ స‌త్య నాదెల్ల చ‌ర్చించిన త‌ర్వాతే ఇది జ‌ర‌గుతుద‌ని ఓ ప్ర‌క‌టన‌లో వెల్ల‌డించింది. 

అమెరికా పౌరుల స‌మాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్ వినియోగించుకునే అవకాశం ఉన్న‌ద‌ని, దేశ భ‌ద్ర‌త దృష్ట్యా టిక్‌టాక్ కార్య‌క‌లాపాల‌పై అమెరికాలో నిషేధం విధిస్తామ‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు. ‌‌


logo