గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 14, 2020 , 08:36:30

మైక్రోసాఫ్ట్ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన టిక్‌టాక్‌

మైక్రోసాఫ్ట్ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన టిక్‌టాక్‌

హైద‌రాబాద్‌: చైనా యాప్ టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాల‌నుకున్న మైక్రోసాఫ్ట్ ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి.  అమెరికాలో టిక్‌టాక్ ఆప‌రేష‌న్స్‌ను బైట్‌డ్యాన్స్ అమ్మ‌డం లేద‌ని మైక్రోసాఫ్ట్ వెల్ల‌డించింది. అమెరికా, చైనా మ‌ధ్య ప్ర‌చ్చ‌న్న యుద్ధం సాగుతున్న నేప‌థ్యంలో టిక్‌టాక్ యాప్‌పై ట్రంప్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. అయితే విశేష ఆదర‌ణ ఉన్న ఆ యాప్‌ను మైక్రోసాఫ్ట్ కొనాల‌నుకున్న‌ది. కానీ త‌మ ఆఫ‌ర్‌ను టాక్‌టాక్ తిర‌స్క‌రించిన‌ట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది.  చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ కంపెనీ టిక్‌టాక్ యాప్‌ను ఆప‌రేట్ చేస్తున్న‌ది. అయితే రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఆ యాప్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్ ప్ర‌య‌త్నించింది. టిక్‌టాక్ డేటా ఆధారంగా అమెరికా ప్ర‌జ‌ల‌పై చైనా నిఘా పెడుతుంద‌ని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాల త‌ర్వాత .. అమెరికాలో టిక్‌టాక్‌ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్ పోటీప‌డ్డాయి. కానీ టిక్‌టాక్‌ను అమ్మేందుకు బైట్‌డ్యాన్స్ సిద్ధంగా లేద‌ని ఇవాళ మైక్రోసాఫ్ట్ స్ప‌ష్టం చేసింది. చైనాతో ఏర్స‌డ్డ స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో.. ఇండియా కూడా టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. 


logo