సోమవారం 30 మార్చి 2020
International - Mar 14, 2020 , 07:07:13

మైక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్న బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్న బిల్ గేట్స్

న్యూయార్క్‌ : మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌కు రాజీనామా చేశారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకున్నారు. ఆయన సాంకేతిక సలహాదారుడిగా కొనసాగనున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల, ఇతర ప్రముఖులకు సాంకేతిక సహకారం అందించనున్నారు బిల్‌గేట్స్‌. దాతృత్వ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించేందుకు బిల్‌గేట్స్‌ వైదొలిగారు. 1975లో పాల్‌ అలెన్‌తో కలిసి బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ స్థాపించారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్య, ఆర్థికం, ఉపాధి కల్పనా రంగాల్లో ఫౌండేషన్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2014లో బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ పదవి నుంచి వైదొలిగారు. 2000లో సీఈవో పదవికి రాజీనామా చేసిన బిల్‌గేట్స్‌.. 2008 నుంచి ఫుల్‌టైం పనికి కూడా ఆయన గుడ్‌బై చెప్పారు.


logo