శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 20, 2020 , 17:23:17

అతిగా మాట్లాడితే.. మైక్ క‌ట్‌

అతిగా మాట్లాడితే.. మైక్ క‌ట్‌

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భాగంగా..  ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య గురువారం రెండో, చివ‌రి చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది.  అయితే ఆ డిబేట్ కోసం కొత్త రూల్ తెచ్చారు.  త‌మ‌కు కేటాయించిన స‌మ‌యం క‌న్నా ఎక్కువ మాట్లాడినా, లేక అవాంత‌రం సృష్టించినా, అప్పుడు మైక్ ఆపేసేందుకు నిర్ణ‌యించారు.  క‌మిష‌న్ ఆన్ ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్స్ ఈ ప్ర‌తిపాద‌నను ఆమోదించింది.  ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య జ‌రిగిన తొలి చ‌ర్చ‌లో ఇద్ద‌రూ ఒక‌ర్ని ఒక‌రు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.  ఈ క్ర‌మంలో ట్రంప్ సుమారు 73 సార్లు బైడెన్‌కు అవాంత‌రం క‌లిగించారు. టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అయ్యే ఈ డిబేట్‌లో ఇద్ద‌రికీ ప్ర‌తి అంశంపై మాట్లాడేందుకు రెండు నిమిషాల స‌మ‌యం కేటాయించారు.