శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 11:49:16

మెక్సికోలో భారీగా క‌రోనా మ‌ర‌ణాలు

మెక్సికోలో భారీగా క‌రోనా మ‌ర‌ణాలు

మెక్సికో: ద‌క్షిణ అమెరికా దేశం మెక్సికోలో క‌రోనా మ‌ర‌ణాలు వేగంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా క‌రోనా పాజిటివ్ కేసులు కూడా రోజూ భారీగా న‌మోద‌వుతున్నాయి. భార‌త కాలమానం ప్రకారం శుక్ర‌వారం తెల్ల‌వారుజ‌మున 6:00 గంట‌ల నుంచి శ‌నివారం తెల్ల‌వారుజామున 6:00 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 522 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 66,851కి చేరింది. 

ఇక క‌రోనా పాజిటివ్ కేసులు కూడా ప్ర‌తిరోజు భారీగానే ఉంటున్నాయి. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 6,196 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మెక్సికోలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,090కి చేరింది. అంత‌కుముందు రోజు కూడా అక్క‌డ 5,937 పాజిటివ్ కేసులు, 513 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. మెక్సికో డిప్యూటీ హెల్త్ మినిస్ట‌ర్ హ్యూగో లోపెజ్ గాటెల్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo