బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 18:41:55

మెక్సికోలో కరోనా మృత్యు హేల

మెక్సికోలో కరోనా మృత్యు హేల

మెక్సికో : మెక్సికోలో కరోనా మృత్య హేల కొనసాగుతుంది. రోజురోజుకూ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 4,16,179 కరోనా కేసులు నమోదు కాగా  46 వేల మందికిపైగా మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలోని ఎపీడిమియాలజీ డైరెక్టర్ జోస్ లూయిస్ అలోమియా శుక్రవారం తెలిపారు. గురువారం ఒక్కరోజే ఆ దేశంలో 5,752 పాజటివ్‌ కేసులు నమోదు కాగా 485 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్చి 11 నుంచి ప్రపంచంలో కరోనా అత్యయిక స్థితి ప్రకటించగా.. నాటి నుంచి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 17.2 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 6 లక్షల 71 వేల మంది మృతి చెందినట్లు అమెరికాకు చెందిన ప్రఖ్యాత జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. logo