శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 09:10:58

40 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

40 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

మెక్సికో సిటీ: లాటిన్ అమెరికా దేశ‌మైన మెక్సికోలో క‌రోనా మ‌ర‌ణాలు 40 వేలు దాటాయి. దీంతో ప్ర‌పంచంలో క‌రోనాతో అత్య‌ధిక మంది మ‌ర‌ణించిన దేశాల జాబితాలో నాలుగో స్థానానికి చేరింది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో 915 మంది కరోనా వైర‌స్‌తో చ‌నిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 40,400కు చేరింది. దేశంలో నిన్న 6,859 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 3,56,255కు పెరిగింది. ఇందులో 88,690 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మెక్సికోలో ఫిబ్ర‌వ‌రి 28న‌ మొద‌టి క‌రోనా కేసు న‌మోద‌య్యింది. 

ప్ర‌పం‌చంలో అత్య‌ధిక క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదైన దేశాల జాబితాలో ల‌క్ష‌కుపైగా మ‌ర‌ణాల‌తో  అమెరికా మొద‌టి స్థానంలో ఉండ‌గా, 80 వేల మ‌ర‌ణాల‌తో బ్రెజిల్,  45,422 క‌రోనా మ‌ర‌ణాల‌తో యూకే రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 


logo