గురువారం 02 జూలై 2020
International - Jun 26, 2020 , 10:41:46

మెక్సికోలో ఘోరం.. 25వేలు దాటిన మృతుల సంఖ్య‌

మెక్సికోలో ఘోరం.. 25వేలు దాటిన మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌: మెక్సికోలో కోవిడ్‌19 వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 25వేలు దాటింది. ఈ విష‌యాన్ని ఆ దేశ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  ఆ దేశంలో సుమారు రెండు ల‌క్ష‌ల‌ మందికి వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది.  ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన ఆ దేశంలో తొలి క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. అయితే మార్చి చివ‌ర నుంచి మెక్సికోలో ష‌ట్‌డౌన్ ప్ర‌క‌టించారు.  చాలా ఆల‌స్యంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించి, మ‌ళ్లీ తొంద‌ర‌గా ఆంక్ష‌ల‌ను ఎత్తివేశార‌ని ఆ దేశాధ్య‌క్షుడు ఆండ్రియాస్ మాన్యువ‌ల్ లోపేజ్ ఓబ్రెడార్‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈనెల ఆరంభంలో మెక్సికోలో మ‌ళ్లీ మార్కెట్లు తెరుచుకుంటున్నాయి.  మ‌రో వైపు అమెరికాలో గురువారం ఒక్క రోజే 37వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  logo