మంగళవారం 07 జూలై 2020
International - Jun 02, 2020 , 10:32:51

మెక్సికోలో 10వేలు దాటిన క‌రోనా మృతులు

మెక్సికోలో 10వేలు దాటిన క‌రోనా మృతులు

హైద‌రాబాద్‌: మెక్సికోలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య ప‌దివేలు దాటింది.  సోమ‌వారం రోజున మెక్సికోలో 237 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 10,167కు చేరుకున్న‌ది. కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2771గా న‌మోదు అయ్యింది. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 93 వేలు దాటింది. పాజిటివ్ కేసుల సంఖ్య మ‌రింత అధిక స్థాయిలో ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆరోగ్య అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. లాటిన్ దేశాల్లో మ‌హ‌మ్మారి కరోనా ఇంకా ఉగ్ర‌రూపు దాల్చ‌లేద‌ని, అప్పుడే లాక్‌డౌన్ నియ‌మాల‌ను ఉల్లంఘించ‌రాదంటూ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆయా దేశాల‌కు ఆదేశాలు జారీ చేసింది. logo