బుధవారం 03 మార్చి 2021
International - Jan 25, 2021 , 10:13:55

మెక్సికో ప్రెసిడెంట్‌కు క‌రోనా పాజిటివ్‌

మెక్సికో ప్రెసిడెంట్‌కు క‌రోనా పాజిటివ్‌

మెక్సికో సిటీ : మెక్సికో అధ్య‌క్షుడు ఆండ్రెస్‌ మ్యానుయ‌ల్ లోపేజ్ ఒబ్రాడార్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ సంద‌ర్భంగా ప్రెసిడెంట్ ఒబ్రాడార్ ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా సోకింద‌ని తెలియ‌జేసేందుకు చింతిస్తున్నాన‌ని తెలిపారు. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ త‌న‌లో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉన్నాయ‌ని చెప్పారు. వైద్యుల సూచ‌న మేర‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. తాను ఈ వైర‌స్ నుంచి త్వ‌ర‌గా కోలుకుంటాన‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు.  

మెక్సికోలో సోమ‌వారం ఉద‌యం 1,752,347 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌ర‌ణాల సంఖ్య 1,49,614కు చేరిన‌ట్లు అధికారులు తెలిపారు. 

VIDEOS

logo