శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 03, 2021 , 06:41:20

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్యురాలికి అస్వస్థత

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్యురాలికి అస్వస్థత

మెక్సికో సిటీ : ఫైజర్ బయోఎన్ టెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మెక్సికోకు చెందిన ఓ 32 ఏళ్ల వైద్యురాలు అవస్థతకు గురైంది. మహిళా డాక్టర్ కేసును తాము అధ్యయనం చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. వైద్యురాలు మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దద్దుర్లు రావడంతో న్యూవో లియోన్‌లోని ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఐసీయూకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ‘ఎన్సెఫలోమైలిటిస్'తో వైద్యురాలు బాధపడుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఎన్సెఫలోమైలిటిస్’ అనేది మెదడు, వెన్నుపాము వాపు. డాక్టర్‌కు అలర్జీ ప్రతిచర్యల చరిత్ర ఉందని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మెదడువాపును అభివృద్ధి చేశారని క్లినికల్ ట్రయల్స్ నుంచి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే దీనిపై ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌ స్పందించలేదు. మెక్సికోలో కరోనా మహమ్మారికి 1,26,500 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవల దేశంలో అత్యవసర వినియోగానికి అమెరికా, జపాన్‌ దిగ్గజాలు ఫైజర్‌ పేరుతో తీసుకువచ్చిన కొవిడ్‌ టీకాకు ఆమోదముద్ర వేసింది.


logo