బుధవారం 03 జూన్ 2020
International - Apr 03, 2020 , 12:56:14

కరోనా బీరు ఉత్పత్తి నిలిపివేత

కరోనా బీరు ఉత్పత్తి నిలిపివేత

హైదరాబాద్: కరోనా కల్లోలం నేపథ్యంలో కరోనా బ్రాండ్ బీరు ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు మెక్సికన్ కంపెనీ గ్రూపో మోడెలో ప్రకటించింది. ఈ కంపెనీ తయారు చేసే ఇతర బ్రాండ్లలో పసిఫికో, మోడెలో వంటివి ఉన్నాయి. కరోనా వ్యాప్తిని మందగించేందుకుగానూ ఏప్రిల్ 30 వరకు అన్నిరకాల పారిశ్రామిక కార్యకలాపాలు నిలిపివేయాలన్న మెక్సికో ప్రభుత్వ ఆదేశాల మేరకు బీరుతయారీని నిలిపివేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వ్యవసాయ పరిశ్రమలు మినహా మిగతా అన్ని యూనిట్లు పనిచేయడం నిలిపివేయాలని మెక్సికో ప్రభుత్వం సూచించింది.  హైనెకెన్ అనే మరో బడా బీరుకంపెనీ కుడా ఉత్పత్తి నిలిపివేస్తుందని పత్రికల్లో వార్తలు వచ్చాయి. 


logo