శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 11:47:58

మ‌నుషుల్లేని చోట బ్యాంక్‌.. దొంగ‌ల కోస‌మే క‌ట్టారేమో!

మ‌నుషుల్లేని చోట బ్యాంక్‌.. దొంగ‌ల కోస‌మే క‌ట్టారేమో!

సాధార‌ణంగా బ్యాంక్ అంటే ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా క‌డుతారు. కుద‌ర‌క పోతే ఊరికి చివ‌ర అయినా క‌డుతారు. కానీ ఈ బ్యాంక్ మాత్రం ఎవ‌రూ లేని ప్ర‌దేశంలో క‌ట్టారు. చుట్టు ప‌క్క‌ల ఎలాంటి గ్రామాలు లేవు. ఎవ‌రైనా రావాలి అంటే సుమారు 20 నిమిషాలు ప్ర‌యాణం చేయాల్సిందే. అంత దూరంలో ఉన్న బ్యాంక్‌లో డ‌బ్బు, న‌గ‌లు డిపాజిట్ చేయాలంటే ప్ర‌జ‌ల గుండెల్లో భ‌యం పుట్టుకుంటుంది. ఎందుకంటే బ్యాంక్ చుట్టుప‌క్క‌ల మ‌నుషులు లేరు గాని దొంగ‌లు మాత్రం ఉన్నారు. వారు మామూలు దొంగ‌లు కూడా కాదు. గ‌జ‌దొంగ‌లు, డ్ర‌గ్స్ దోపిడీదారులు ఉన్నారు. మ‌రి ఈ బ్యాంక్‌ను నిర్మానుష్య ప్ర‌దేశంలో క‌ట్ట‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంద‌ట‌.

మెక్సికోలో క‌ట్టిన ఈ బ్యాంక్ అందుబాటులో లేనందువ‌ల్ల ప్ర‌జ‌లు వారి అధ్య‌క్షుడు ఆండ్రెస్ మాన్యువ‌ల్ లోపెజ్ ఒబ్రాడోర్‌ను ఆడిపోసుకుంటున్నారు.  చివావా అనే నగరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ బ్యాంకును నిర్మించారు. ఇది కాస్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టేస‌రికి అధికారులు స్పందించ‌క త‌ప్ప‌లేదు. ‘‘మా బ్యాంకు శాఖను చివావా అనే చిన్న మున్సిపాలిటీలోని సెంట్రల్ ఏరియాలో కట్టాలని అనుకున్నాం. కానీ, మేయర్ హెక్టార్ మారియో గలాజ్ బ్యాంక్ భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ బ్యాంక్ ఎక్కడ కట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో మెక్సికో సైన్యం కొంత స్థలాన్ని కేటాయించింది. దీంతో అక్కడే బ్యాంకును కట్టాం’’ అని బ్యాంకు ప్రతినిధి మారియో సల్దానా చెప్పుకొచ్చారు. ఈ బ్యాంక్‌కు ఏర్పాటు చేసిన ఫర్నిచ‌ర్‌ను కూడా దుండ‌గులు తీసుకెళ్లారు. ఈసారి సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేసిన త‌ర్వాత ఫ‌ర్నీచ‌ర్ ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారు. logo