శనివారం 16 జనవరి 2021
International - Dec 06, 2020 , 18:32:35

మెర్సిడెస్ బెంజ్ " జీ400 డీ వెర్షన్" లాంచ్...

మెర్సిడెస్ బెంజ్

 బెర్లిన్: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ ఉత్పత్తిని 4 లక్షల యూనిట్లు పూర్తి చేసింది. ఆ సందర్భంగా బెంజ్ కంపెనీ 400000వ వాహనంగా "మెర్సిడెస్ బెంజ్ జి 400 డీ" వెర్షన్‌ను ఆవిష్కరించింది. కంపెనీ ఈ కారును జర్మనీలోని రైన్‌ల్యాండ్‌లోని గ్యారేజీకి పంపినట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ ఐకానిక్ కార్లలో 20 యూనిట్లు ఉంన్నాయి. మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ మొదటిసారి 1979 లో ప్రవేశపెట్టారు. మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం జి-క్లాస్ వాహనాలను ఆస్ట్రియాలోని గ్రాజ్‌ కంపెనీ వద్ద ఉత్పత్తి చేస్తుంది.

2017లోనే కంపెనీ 300,000 యూనిట్ల ఉత్పత్తిని సాధించిందని, తక్కువ సమయంలో కంపెనీ 4 లక్షల యూనిట్లను సాధించిందని కంపెనీ వెల్లడించింది. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన జి-క్లాస్ శ్రేణిలో రెండు వేరియంట్లను విక్రయిస్తున్నది. వీటిలో మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి , మెర్సిడెస్ బెంజ్ జి 350డీ  ఉన్నాయి. ఇవే కాకుండా, ఇక్యూ సబ్ బ్రాండ్‌లో భాగమైన జి-క్లాస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా కంపెనీ పనిచేస్తున్నది. భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ జి 350 డి 2019 అక్టోబర్‌లో భారత మార్కెట్లో విడుదల చేశారు. మెర్సిడెస్ బెంజ్ జి 350 డి భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.5 కోట్లు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.