మంగళవారం 31 మార్చి 2020
International - Jan 30, 2020 , 23:42:59

సార్వత్రిక మొబైల్ చార్జర్!

సార్వత్రిక మొబైల్ చార్జర్!
  • ఐరోపా పార్లమెంట్ తీర్మానం

బ్రసెల్స్: ఇకపై ఒకేరకమైన మొబైల్ చార్జర్ ఉండాలని ఐరోపా పార్లమెంట్ డిమాండ్ చేసింది. యూనివర్సల్ (అన్ని సెల్‌ఫోన్లకు ఉపయోగపడే) చార్జర్ కోసం టెక్ కంపెనీలపై, ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తున్న ఆపిల్ సంస్థపై ఐరోపా సమాఖ్య ఒత్తిడి తేవాలని పేర్కొంది. మార్కెట్లో పలు రకాల మొబైల్ చార్జర్ల వల్ల వినియోగదారులు సెల్‌ఫోన్లు మార్చిన సందర్భాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని ఐరోపా పార్లమెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఐరోపా సమాఖ్య దేశాల్లో అంతటా సార్వత్రిక మొబైల్ ఫోన్ చార్జర్ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది. దీనికి సంబంధించిన తీర్మానానికి అనుకూలంగా 582 మంది, వ్యతిరేకంగా 40 మంది సభ్యులు ఓటు వేశారు. మరోవైపు ఈ ప్రతిపాదనను ఆపిల్ సంస్థ తప్పుపట్టింది.


logo
>>>>>>