బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 12:28:03

మియామ్ మియామ్ టెంపుల్‌‌.. ఇదో పుణ్య‌క్షేత్రం! ఇక్క‌డంతా ప్రేమికులే..

మియామ్ మియామ్ టెంపుల్‌‌.. ఇదో పుణ్య‌క్షేత్రం! ఇక్క‌డంతా ప్రేమికులే..

మియామ్ మియామ్ టెంపుల్ పిల్లుల‌తో నిండిన పుణ్య‌క్షేత్రం. ఇక్క‌డ పిల్లి జాతి నేప‌థ్య ఆహారాన్ని తినొచ్చు. అంతేకాదు స్మార‌క చిహ్నాల‌ను కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. పిల్లి ప్రేమికుల‌కు ఇదొక అధ్యాత్మిక ప్ర‌దేశం. వారు త‌ప్ప‌కుండా ఈ ఆల‌యాన్ని సంద‌ర్శించాలి. జపాన్లోని క్యోటోలో ఉన్న ఈ ప్రసిద్ధ పిల్లి మందిరం మియామ్‌ మియామ్‌ పుణ్యక్షేత్రంగా ఆంగ్లంలో అనువదించబడిన న్యాన్ న్యాన్ జీ. ఇక్కడ పిల్లి జాతులే సన్యాసి, సహాయకుల పాత్రను పోషిస్తాయి.

కోయుకి అనే పిల్లి ఆలయానికి ప్రధాన సన్యాసి. దీంతోపాటు మ‌రో ఆరు పిల్లులు ప‌నిచేస్తాయి. వాకా, చిన్, అరుజీ, రెన్, కోనాట్సు, చిచ్చి. కోయుకి క్రోధస్వభావం కారణంగా ఆలయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పిల్లి అని చెప్పడంలో సందేహం లేదు. "పూజకు వచ్చే సందర్శకులు పిల్లులతో ఆడుతారు. కేఫ్‌లు, పిల్లి కళలను ఆనందిస్తారు" అని కోయుకి యజమాని బోర్డ్ పాండాతో అన్నారు. తన అభిమాన పిల్లి ఇతివృత్తం ఆధారంగా చిత్రకారుడు తోరు కయా 2016 లో పిల్లి ఆలయాన్ని తెరిచారు. ఈ ఆలయంలో పిల్లుల‌ విగ్రహాలు, డ్రాయింగ్‌లు ఉన్నాయి. సందర్శకులు పిల్లి నేపథ్య ఆహారం, పానీయాలను ఆల‌యం లోప‌ల ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. అక్క‌డ 'లిటిల్ ఫూట్మార్క్ రెన్' అనే దుకాణం కూడా ఉంది. ఇందులో స్మార‌క చిహ్నాలు అందుబాటులో ఉంటాయి. logo