శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 15:04:07

ఇక్క‌డ మొక్క‌లు నాటుతుంటే అక్క‌డ పీకేస్తున్నారు.. మ‌తానికి విరుద్ధ‌మంట‌!

ఇక్క‌డ మొక్క‌లు నాటుతుంటే అక్క‌డ పీకేస్తున్నారు.. మ‌తానికి విరుద్ధ‌మంట‌!

ప‌చ్చ‌ద‌నం ప్ర‌గ‌తికి మెట్లు. చెట్లు లేనిదే జీవం లేదు. వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండాలి అంటే చెట్టు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. అందుక‌నే తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ చాలెంజ్ నిర్వ‌హించింది. దీని ద్వారా ప్ర‌తిఒక్క‌రూ మొక్క‌లు నాటుతూ ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షిస్తున్నారు. ప‌చ్చ‌ద‌నానికి మ‌ళ్లీ జీవం పోస్తున్నారు. ఇక్క‌డ ఇన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. పాకిస్తాన్లో మాత్రం అంతా రివ‌ర్స్‌.. ఉన్న మొక్క‌లు పీకేస్తున్నారు.

పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవ‌ల మొక్క‌ల‌ను నాటి ప‌చ్చ‌ద‌నం పెంపొందించాల‌ని పిలుపునిచ్చారు. ఈ ప‌ద్ధ‌తి ఓ వ‌ర్గానికి అస‌లు న‌చ్చ‌లేదు. ఇది ఇస్లాంకు వ్య‌తిరేక‌మంటూ మ‌తానికి ముడిపెట్టారు. కొంత‌మంది యువ‌కుల‌తో నాటిన మొక్క‌ల‌ను పీకేపించారు. ఈ సంఘ‌ట‌న జ‌రిగేట‌ప్పుడు కొంత‌మంది వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైర‌ల్ అయింది. అయితే ఈ ప‌నికి ఇస్లాం పెద్ద‌లే త‌ప్పుబ‌డుతున్నారు. మ‌తానికి, మొక్క‌లు సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దానికి వారు మేము అందుకు పీక‌లేదు. ఖాళీ స్థ‌లంలో మొలిచిన మొక్క‌ల్ని పీకేశాం. అని ర‌క‌ర‌కాలుగా స‌మాధానాలు చెబుతున్నార‌ట‌. మ‌రి ఏది నిజ‌మో వారికే తెలియాలి. 


logo