శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 02:13:33

రచ్చకెక్కిన ట్రంప్‌ ఇంటి పోరు!

రచ్చకెక్కిన ట్రంప్‌ ఇంటి పోరు!

వాషింగ్టన్‌: నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం అంటే ఏంటో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భార్య మెలానియా చక్కగా చూపించారు. గురువారం రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో  పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్‌కు ట్రంప్‌ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా తన కూతురు ఇవాంకాను వేదిక మీదకు పిలిచారు. అప్పటికే వేదిక మీద ఉన్న మెలానియా తన సవతి కూతురును నవ్వుతూ పలకరిస్తూనే క్షణాల వ్యవధిలో మొహం చిట్లించారు. ఇవాంకా ట్రంప్‌ మొదటి భార్య కూతురు. మూడు సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయింది. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ దీనిని ప్రచార ఆయుధంగా మలుచుకున్నది.  మెలానియా, ఇవాంకాకు సత్సంబంధాలు లేవని చాలాకాలంగా అమెరికన్‌ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. 


logo