సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 20:22:46

గ్రీన్‌డ్రెస్‌‌లో అంద‌రి ముందు ఇబ్బంది ప‌డుతున్న మెలానియా ట్రంప్‌!

గ్రీన్‌డ్రెస్‌‌లో అంద‌రి ముందు ఇబ్బంది ప‌డుతున్న మెలానియా ట్రంప్‌!

డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాను చూసి మెలానియా ట్రంప్ ఫేస్ ఎక్స్‌ప్రెష‌న్స్ మారిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఆర్‌ఎన్‌సి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా తన పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ తిరిగి నామినేషన్‌ను అంగీకరించారని సిఎన్‌ఎన్ నివేదించింది. అయితే, మెలానియా ట్రంప్ తన సవతి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను వేదికపైకి పలకరించిన త‌ర్వాత ఆమె ముఖం మాడిపోయింది.

స్టేజ్ మీద గ్రీన్ డ్రెస్‌లో మెలానియా నిల‌బ‌డి ఉంది. ఇవాంకాను  పిల‌వ‌డంతో ఆమె స్టేజ్ ఎక్కింది. మొద‌ట ఇవాంకాను ఆనందంగా స్వాగ‌తించి, ఆ త‌ర్వాత ముఖం చిట్లించుకున్న‌ది మెలానియా. దీనికి కార‌ణం ఇవాంకాను పిల‌వ‌డం ఆమెకు ఇష్టం లేద‌ని కొంద‌రంటుంటే మ‌రికొంద‌రేమో పాపం గ్రీన్‌డ్రెస్ సౌక‌ర్యంగా లేన‌ట్లుంద‌ని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే 11 మిలియ‌న్ల‌కు పైగా వీక్షించారు. 


logo