మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 09, 2020 , 11:37:09

మెలానియా ట్రంప్ విగ్ర‌హానికి నిప్పు

మెలానియా ట్రంప్ విగ్ర‌హానికి నిప్పు

స్లొవేనియా : అగ్ర రాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ విగ్ర‌హానికి నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న ఆమె స్వ‌స్థ‌ల‌మైన స్లొవేనియాలోని జులై 4న రాత్రి చోటు చేసుకుంది. స్లోవేనియాలో మెలానియా ట్రంప్ రూపాన్ని పోలిన చెక్క విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. అయితే అమెరిక‌న్లు స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు(జులై 4) జ‌రుపుకున్న రోజున మెలానియా విగ్ర‌హానికి నిప్పు పెట్టారు. ఈ విష‌యాన్ని విగ్ర‌హాన్ని రూపొందించిన ఆర్టిస్ట్ బ్రాడ్ డౌనీ వెల్ల‌డించారు.

జులై 5న డౌనీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసి విగ్ర‌హాన్ని తొల‌గించారు. డౌనీ ఫిర్యాదుపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ద‌ర్యాప్తు పూర్తి కానందున వివ‌రాలు వెల్ల‌డించ‌లేమ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. మెలానియా ట్రంప్ విగ్ర‌హం ధ్వంసం ఘ‌ట‌న‌పై వాషింగ్ట‌న్ లోని మెలానియా కార్యాల‌యం ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. ఇక డొనాల్డ్ ట్రంప్ చెక్క విగ్ర‌హాన్ని ఈ ఏడాది జ‌న‌వ‌రిలో దుండ‌గులు ద‌గ్ధం చేసిన విష‌యం విదిత‌మే.


logo