క్యాపిటల్ దాడితో నిరాశ చెందా : మెలానియా ట్రంప్

వాషింగ్టన్ : క్యాపిటల్ భవనంపై దాడి చేయడం చాలా తప్పు అని, దీని కారణంగా చాలా నిరాశ చెందానంటున్నది డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్. ఈ హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నది. క్యాపిటల్ ఘర్షణలో చనిపోయినవారి కుటుంబాల కోసం ప్రార్థించాలని మెలానియా ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైనట్లు ప్రకటించేందుకు సమావేశం కానున్న క్యాపిటల్‌ను హస్తగతం చేసుకోవడం ద్వారా పైచేయి సాధించాలని ట్రంప్ మద్దతుదారులు భావించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో క్యాపిటల్ భవనం వద్ద గుమిగూడి బైడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. దాదాపు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే, క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ట్రంప్ మద్దతుదారులు ఒకవైపు ప్రయత్నిస్తున్న సమయంలో ట్రంప్ కుటుంబసమేతంగా ఒక పార్టీలో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు దుమ్మెత్తిపోశారు.
ఐదు రోజుల తర్వాత ట్రంప్ సతీమని మెలానియా నోరు మెదిపారు. క్యాపిటల్ భవనంపై హింసాత్మక దాడితో నిరాశకు గురయ్యానని, తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇలాంటి హింసాత్మక దాడి ఎనాటికీ ఆమోదయోగ్యం కాదన్నారు. గాయపడిన వారికి తగిన వైద్యం అందించేలా చూడాలని కోరారు. హింసను నిలిపివేయాలని ప్రజలను వేడుకుంటున్నానని మెలానియా చెప్పారు. అమెరికా ప్రథమ మహిళగా పనిచేయడం నా జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నానని, గత నాలుగేండ్లుగా నా భర్తకు, నాకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
హింస కారణంగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, ఇతర నాయకులు అధ్యక్షుడ పదవికి ట్రంప్ రాజీనామా చేయాలని సూచించారు. లేనిపక్షంలో ఆయనను పదవి నుంచి తొలగించడానికి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఆలయ ప్రహరీ మరమ్మతు ప్రారంభం
- కరోనా నిబంధనలు పాటించాలి
- ఏటూరునాగారంలో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి
- గొగోయ్‌కి ‘జెడ్‌ప్లస్' భద్రత
- అమెరికా తొలి నల్లజాతి రక్షణమంత్రిగా ఆస్టిన్
- పాత రూ.100 నోట్లు ఔట్
- మూడు దుర్ఘటనల్లో 18మంది మృతి
- హై హై.. నాయకా
- అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం
- పంటల కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ నిఖిల సమీక్ష