సోమవారం 25 మే 2020
International - Apr 02, 2020 , 14:17:19

భారత్‌లో మర్కజ్‌.. ఫ్రాన్స్‌లో మల్హౌస్‌

భారత్‌లో మర్కజ్‌.. ఫ్రాన్స్‌లో మల్హౌస్‌

హైదరాబాద్‌: ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చే ఫ్రాన్స్‌ కరోనా బారిన ఎలా పడిందని మేధావులను వేధిస్తున్న ప్రశ్న. అయితే ఆ దేశంలో ఇంతగా మరణాలు సంభవించడానికి, కేసులు నమోదవడానికి సామూహిక ప్రార్ధనలే కారణం. అవున మన దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న మర్కజ్‌ ప్రార్థనల్లో ఎలాగైతే వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో జనాలు పాల్గొన్నారో, ఇదే తరహాలో ఫ్రాన్స్‌ తూర్పు ప్రాంతంలోని చిన్న పట్టణమైన మల్హౌస్‌లో ఉన్న ఎవాంజెలికల్‌ చర్చి. భారత్‌లో కరోనా కేసులు ఇక తగ్గుముఖం పడుతాయనుకున్న సమయంలో ‘మర్కజ్‌' బాంబు పేలింది. మార్చి నెలలో జరిగిన సామూహిక జరిగిన ప్రార్థనల్లో మొత్తం 9000 మంది పాల్గొనగా వారిలో 6000 మందిని గుర్తించారు. వీరిలో 300కుపై కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 3000 మందిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులో మర్కజ్‌తో సంబంధం ఉన్నవే అధికంగా ఉన్నాయి. అచ్చం ఇలాగే మల్హౌస్‌ చర్చిలో కూడా ఫిబ్రవరి 17 నుంచి ఐదురోజులపాటు జరిగిన ఈ సామూహిక ప్రార్థన 2500 మంది పాల్గొన్నారు. అయితే అప్పటికి దేశంలో వైరస్‌ వ్యాప్తి లేకపోవడం, దాన్ని కేవలం చైనాకే పరిమితమనుకోవడంతో చర్చికి సంబంధించిన మతాధికారులు ప్రార్థనలకు హాజరైనవారి ఆరోగ్యంపై అంతగా దృష్టి కేంద్రీకరించలేదు. ఈ నిర్లక్ష్యమే ఫ్రాన్స్‌ను ఆరోగ్య అత్యవసర పరిస్థితిలోకి నెట్టివేసింది. క్రమంగా కేసుల సంఖ్య, మరణాలు కూడా పెరుగుతుండటంతో దీనంతటికీ బీజం ఎక్కడ పడిందో కనుక్కోవడం అధికారులు ప్రారంభించారు. ఒక్క కేసును పరిశీలిస్తూ వెళ్లిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో కరోనా వైరస్‌ విస్తరించడానికి ప్రధాన కారంణం ఫిబ్రవరిలో మల్హౌస్‌ చర్చిలో జరిగిన ప్రార్థనలేనని తెలుసుకున్నారు. ఫిబ్రవరి 29న ఒక ఒక మహిళకు కరోనా లక్షణాలు గుర్తించగా, ఆమె కుటుంబ సభ్యులు ఆ ప్రార్థనల్లో పాల్గొన్నారని తెలిపింది. మల్హౌస్‌కు 625 కి.మీ. దూరంలో ఉన్న ఒక వ్యక్తిని  మార్చి 2న పరీక్షించగా అతనికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆరాతీయగా తాను కొన్ని రోజుల క్రితం  మల్హౌస్‌ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు వెల్లడించాడు. ఇలా ఫ్రాన్స్‌లో అంతగా వైరస్‌ ఆనవాలు లేని ప్రాంతాలైన ఓర్లీన్స్‌, డిజోన్‌, బెసాన్కాన్‌, మాకాన్‌తోపాటు, ఇతర దేశాల్లో కూడా మల్హౌస్‌ చర్చ్‌తో సంబంధం ఉన్న కేసులను గుర్తించారు. ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో 56,989 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల విషయంలో 4032తో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నది. బుధవారం ఒక్కరోజే 509 మరణించారు. నిజానికి ఈ సంఖ్య అధికంగానే ఉండే అవకాశం ఉంది.  logo