ఆదివారం 29 నవంబర్ 2020
International - Oct 23, 2020 , 17:26:52

ఆకుపచ్చ కుక్కపిల్ల.. ఫొటోలు వైరల్‌!

ఆకుపచ్చ కుక్కపిల్ల.. ఫొటోలు వైరల్‌!

సార్డినియా: కుక్కలు ఏ రంగులో ఉంటాయి..? వైట్‌, బ్లాక్‌, బ్రౌన్ రంగులలోనే కదా..!మరి ఆకుపచ్చ కుక్కను ఎప్పుడైనా చూశారా? ఇటలీలో ఓ పప్పీ ఆకుపచ్చ బొచ్చుతో జన్మించిందట. ఈ కుక్కపిల్ల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఇటలీలోని సార్డినియాలో ఈ అరుదైన కుక్కపిల్ల జన్మించింది. క్రిస్టియన్ మల్లోకి అనే రైతుకు స్పెలాచియా అనే కుక్క ఉంది. అది ఇటీవల ఈ ఆకుపచ్చ కుక్కపిల్లకు జన్మనిచ్చింది. నాలుగు పిల్లలు పుట్టగా మిగతా మూడు తెలుపురంగులోనే ఉన్నాయి. ఈ అరుదైన కుక్కపిల్లకు ‘పిస్తా’ అని పేరు పెట్టారు. పిస్తా ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బిలివర్డిన్ అనే ఆకుపచ్చ వర్ణద్రవ్యం వల్ల అది గ్రీన్‌ కలర్‌లో పుట్టిందని నిపుణులు పేర్కొన్నారు. కాగా, ఆకుపచ్చ రంగు అదృష్టానికి సంకేతమని, కరోనా మహమ్మారి సమయంలో ఈ కుక్కపిల్ల మా ఇంట్లోకి రావడం శుభసూచకంగా భావిస్తున్నామని మల్లోకి తెలిపారు.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.