ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 18:07:43

పిజ్జా చెఫ్‌కు వింతైన ఆర్డర్‌..!

పిజ్జా చెఫ్‌కు వింతైన ఆర్డర్‌..!

హైదరాబాద్: కస్టమర్ల నుంచి చెఫ్‌లు అభ్యర్థనలు పొందడం మామూలే. అవి కొన్నిసార్లు సాధారణంగా ఉండగా, మరికొన్ని సార్లు వింతగా ఉంటాయి. ఇటీవల ఓ వినియోగదారుడు చెఫ్‌కు చేసి అభ్యర్థన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వెజ్‌ పిజ్జాలో కొంచెం జున్ను కలపమని అభ్యర్థించాడు. దీంతో అవాక్కైన చెఫ్‌ ఆ మెసేజ్‌ రెడ్‌ఇట్‌లో పెట్టగా, నెటిజన్లకు నవ్వుతెప్పించింది. 

ఐడెన్ అనే వ్యక్తి తన భార్యకు తెలియకుండా వెజ్‌ బర్గర్‌లో జున్ను ముక్కలు జోడించమని చెఫ్‌ను అభ్యర్థించాడు. ‘వెజ్‌ బర్గర్‌లో జున్ను అనేది విచిత్రమైనదే. కానీ నేను శాకాహారిని కాను. నా భార్య నన్ను గొడ్డు మాంసం తినేందుకు అనుమతించదు. గుండె జబ్బులు వస్తాయని ఆమె భయపడుతోంది. అందుకే  నాలాంటి చెడ్డ కుర్రాడి కోసం మీరు ఈ వెజ్‌ పిజ్జాలో కొంచెం జున్ను ఎక్కువగా వేయండి. మీకు అద్భుతమైన రాత్రి ఉందని ఆశిస్తున్నాను.’ అని ఆర్డర్‌ డిస్క్రిప్షన్‌లో అభ్యర్థించాడు. రెడ్‌ఇట్‌లో షేర్‌ అయిన ఈ నోట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo