మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 10, 2020 , 14:51:34

ఇంటర్నెట్‌లో వినతులు..చికెన్‌ మెక్‌గ్రిల్ బర్గర్ అమ్మకాలు షురూ!

ఇంటర్నెట్‌లో వినతులు..చికెన్‌ మెక్‌గ్రిల్ బర్గర్ అమ్మకాలు షురూ!

హైదరాబాద్‌: ఏదైనా సమస్యకు పరిష్కారం లభించాలన్నా.. ఓ అంశం వేగంగా ప్రజల్లోకి దూసుకుపోవాలన్నా.. మానవత్వం చూపే వారిని ఒక్కటి చేయాలన్నా.. అది ఇప్పుడు ఇంటర్‌నెట్‌తోనే సాధ్యం. సామాజిక మాధ్యమం సమస్యా పరిష్కార మార్గంగా మారిపోయింది. ఉద్యమాలకు ఊపిరిగా తయారయ్యింది‌. దీనికి ఇటీవల జరిగిన ‘చికెన్‌మెక్‌గ్రిల్‌ బర్గర్‌’ కథే మంచి ఉదారహరణ.

చికెన్‌మెక్‌గ్రిల్‌ బర్గర్‌ అంటే చాలామంది ఇష్టపడతారు. మెక్‌డొనాల్డ్స్‌ బర్గర్‌ తినందే నిద్రపోనివారు చాలామంది ఉన్నారంటే అతశయోక్తి కాదు. చికెన్‌ ప్యాటీ, పుదీనా మయోనైజ్‌తో చేసిన రుచికరమైన చికెన్‌మెక్‌గ్రిల్‌ బర్గర్‌ అంటే భోజనప్రియులు పడిచస్తారు. అయితే, మెక్‌డొనాల్డ్స్‌ 2019లో బర్గర్‌ను మెనూ నుంచి తొలగించింది. రెస్టారెంట్‌లో వాటికి జనాదరణ లేదని మెక్‌డొనాల్డ్స్‌ పరిగణించడం దీనికి కారణం. దీనిపై దిశాప్రకాశ్‌ అనే మహిళ ఆన్‌లైన్ వేదికగా పిటిషన్‌ను ప్రారంభించింది. ‘ఇది అద్భుతమైన మెనూ, ఇది మెనూలో ఉండేందుకు అర్హమైనది. ఇది మినిమాలిక్ బర్గర్, క్లాసిక్ ఫేవరెట్’ అని పిటిషన్‌లో పేర్కొంది. దీనికి బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, హాస్యనటుడు అభిషేక్ ఉప్మాన్యు, చాలా మంది ప్రముఖులు మద్దతు తెలిపారు. దీంతో మెక్‌డొనాల్డ్స్‌ చికెన్‌ మెక్‌గ్రిల్‌ బర్గర్‌ను తిరిగి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో వచ్చిన డిమాండ్‌ మేరకు బర్గర్‌ అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తన నిర్ణయాన్ని  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. ‘మెక్‌గ్రిల్ఈజ్‌ బ్యాక్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌ చేసిన వెంటనే పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఆ పోస్ట్‌ కింద నెటిజన్లు తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. 2020 లో వచ్చిన కొన్ని శుభవార్తల్లో ఇది ఒకటి అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.